రూ.26తో రీచార్జ్ చేయించుకోండి.. 26 గంట‌లు మాట్లాడుకోండి.. బీఎస్ఎన్ఎల్ రిప‌బ్లిక్ డే ఆఫ‌ర్‌.. నేటి నుంచే!

25-01-2017 Wed 09:00 | Business
ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్‌) స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రూ.26 తో రీచార్జ్ చేసుకోవ‌డం ద్వారా బీఎస్ఎన్ఎల్ పరిధిలో 26 గంట‌ల పాటు లోక‌ల్‌, ఎస్టీడీ వాయిస్ కాల్స్‌ను అప‌రిమితంగా చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది.

నేటి(25వ తేదీ) నుంచి ఈనెల 31 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది‌. దీంతోపాటు మ‌రో రెండు ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టించింది. కాంబో 2601 పేరుతో అందిస్తున్న ఆఫ‌ర్‌లో భాగంగా రూ.2600తో రీచార్జ్ చేసుకుంటే రూ.1300 అద‌న‌పు టాక్‌టైం పొంద‌వ‌చ్చు. రూ.2600 మెయిన్ బ్యాలెన్స్‌లో జ‌మ అవుతుంది. అద‌న‌పు టాక్‌టైమ్‌ సెకండ‌రీ అకౌంట్‌లో జ‌మ అవుతుంది. దీనిని మూడు నెల‌ల్లోపు వినియోగించుకోవ‌చ్చ‌ని సంస్థ చైర్మ‌న్ శ్రీ‌వాస్త‌వ తెలిపారు. అలాగే  ‘కాంబో 6801’ పేరిట తీసుకొస్తున్న మ‌రో ఆఫర్‌లో రూ. 6800తో రీచార్జ్ చేసుకోవ‌డం ద్వారా అంతే మొత్తం మెయిన్ బ్యాలెన్స్‌లో ల‌భించ‌డంతోపాటు మ‌రో రూ.6800 సెకండ‌రీ అకౌంట్‌లో జ‌మ అవుతుంది. దీనిని మూడు నెలల్లో వినియోగించుకోవాల‌ని, మెయిన్ బ్యాలెన్స్‌కు మాత్రం కాల‌ప‌రిమితి ఉండ‌ద‌ని శ్రీ‌వాస్త‌వ పేర్కొన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more