హిరాఖండ్ రైలు ప్ర‌మాదానికి కార‌ణం సడన్ బ్రేక్? .. విశ్లేషిస్తున్న సీనియ‌ర్ అధికారులు!

24-01-2017 Tue 06:32 | Andhra
విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రెండు రోజుల క్రితం జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదానికి కార‌ణం స‌డ‌న్ బ్రేకేన‌ని సీనియ‌ర్ రైల్వే అధికారులు చెబుతున్నారు. లోకోపైల‌ట్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిందంటున్నారు. ప్ర‌ధాన‌మార్గంలో రైలు వెళ్తున్న‌ప్పుడు  లోకోపైల‌ట్ స‌డ‌న్‌గా బ్రేకు వేయ‌డం ముమ్మాటికీ త‌ప్పేన‌ని ట్రైన్స్ పాసింగ్ ఆప‌రేష‌న్ విభాగంలో ముఖ్య ర‌వాణా అధికారిగా ప‌నిచేసి రిటైరైన అధికారి ఒక‌రు తెలిపారు. మెయిన్ లైన్‌లో రైళ్లు గంట‌ల‌కు 70-80 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంటాయ‌ని, అలాంటి స‌మ‌యంలో స‌డ‌న్ బ్రేక్ వేయ‌డం వ‌ల్ల ఇటువంటి ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి దాటాక జ‌గ‌ద‌ల్‌పూర్ నుంచి భువ‌నేశ్వ‌ర్‌వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజ‌య‌న‌గరం జిల్లా కూనేరు రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పిన విష‌యం తెలిసిందే.

కూనేరు క్రాసింగ్ పాయింట్ వ‌ద్ద రైలు వెళ్లే ప‌ట్టా అడుగు మేర విరిగిపోయింది. ఇది గ‌మ‌నించని డ్రైవ‌ర్ రైలును పోనిచ్చాడు. రైలులోని స‌గం బోగీలు విరిగిపోయిన ప‌ట్టా నుంచి సుర‌క్షితంగా వెళ్లిపోయాయి. అయితే ఆ త‌ర్వాత కాసేప‌టికే పెద్ద శ‌బ్దం రావ‌డంతో పైల‌ట్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. దీంతో వెన‌క బోగీలు ప‌ట్టాలు త‌ప్పి ఒక‌దానిపైకి ఒక‌టి ఎక్కేశాయి. ప‌క్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. డ్రైవ‌ర్ క‌నుక స‌డ‌న్ బ్రేక్ వేయకుంటే ముందు బోగీల్లానే వెన‌క బోగీలు కూడా సుర‌క్షితంగా దాటి ఉండేవ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ ప‌ట్టాలు త‌ప్పినా అదే వేగంతో కొంత‌దూరం వెళ్లి ఆగిపోయి ఉండేవంటున్నారు. దీనివ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త చాలావ‌ర‌కు త‌గ్గేద‌ని అంటున్నారు. డ్రైవ‌ర్ భ‌యంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని, స‌డ‌న్ బ్రేకే కొంప ముంచింద‌ని చెబుతున్నారు. మెయిన్‌లైన్‌లో వెళ్తున్న‌ప్పుడు  స‌డ‌న్ బ్రేక్ వేయ‌కూడ‌ద‌న్న విష‌యం లోకో పైల‌ట్ కు తెలియక పోవడం వల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని తేల్చి చెబుతున్నారు.

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more