రాయల నాటి గోపురానికి పూర్వ వైభవం.. నాటి నిర్మాణ శైలిని తలపించేలా పునర్నిర్మాణం!

23-01-2017 Mon 15:36 | Andhra
శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ భారతదేశంలో తన విజయానికి చిహ్నంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాజగోపురం నిర్మించారు. 1516లో దీని నిర్మాణం జరిగింది. ఎలాంటి పునాదులు లేకుండానే ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున దీన్ని నిర్మించారు. దీని పొడవు 96 అడుగులు, వెడల్పు 64 అడుగులు. దేవాలయానికి చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు ఈ గోపురం కనిపించేది. అయితే, కాలక్రమేణా ఈ గోపురం శిథిలావస్థకు చేరుకుంది. 2010 మే 26వ తేదీన ఈ గోపురం కూలిపోయింది. గోపురం కూలిపోవడంతో ఆలయం కళ కోల్పోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ గోపురాన్ని నిర్మించేందుకు నవయుగ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. 2010 ఆగస్టు 29న ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య గోపురం పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఉండటంతో నిర్మాణం నిదానంగా కొనసాగింది. గోపురం కూలినప్పటి బాధితులకు కూడా పరిహారం చెల్లించి, ఆ తర్వాత పనులను వేగవంతం చేసి పూర్తి చేసింది నవయుగ సంస్థ. దీని నిర్మాణానికి రూ. 50 కోట్లు ఖర్చయింది.

దేవ రాయల కాలంలో కట్టినట్టే ఇప్పుడు కూడా గోపురాన్ని నిర్మించారు. పాత నిర్మాణం లాగానే పునాదులు లేకుండానే, పూర్తిగా ఇసుక మీదే నిర్మాణం చేశారు. ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మించారు. 35 అడుగుల మేర రాతి కట్టడం, మిగిలిన నిర్మాణాన్ని ఇటుకలతో పూర్తి చేశారు. ఎక్కడా సిమెంటును వినియోగించకపోవడం విశేషం. పాత తరహాలోనే కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డు సొనను నిర్మాణానికి వినియోగించారు. ఈ గోపురం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/t4LNc_vKZ_U" frameborder="0" allowfullscreen></iframe>

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more