భారత మార్కెట్ లో విపరీతంగా అమ్ముడవుతున్న చైనా స్మార్ట్ ఫోన్లు
ఇక భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లలో 7 శాతంతో జియోమి మూడో స్థానంలో ఉంది. 30 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం, భారత స్మార్ట్ఫోన్ల అమ్మకాలు తగ్గిపోయాయి. దేశీయ కంపెనీ అయిన మైక్రోమ్యాక్స్ అమ్మకాలు అక్టోబర్ లో 16.7 శాతం తగ్గాయని తెలిపింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భవిష్యత్తులో మరింత పెరుగనున్నాయి. భారత్లో తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేలో తేలింది. అందుకే లెనొవో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.