ఆంధ్రా నేత‌ల‌ను చూసైనా నేర్చుకోండి.. ప్ర‌తిప‌క్షాల‌కు తెలంగాణ మంత్రి ల‌క్ష్మారెడ్డి హితవు

03-01-2017 Tue 06:35 | Telangana
తమ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు తెలంగాణ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి క్లాస్ తీసుకున్నారు. ఆంధ్రా నాయ‌కుల‌ను చూసి నేర్చుకోవాల‌ని చుర‌క‌లంటించారు. ప్ర‌భుత్వం ఏ ప‌థ‌కం చేప‌ట్టినా దానికి అడ్డుగా నిల‌వ‌డం, విమ‌ర్శించ‌డం ప్ర‌తిప‌క్షాలకు ప‌రిపాటిగా మారింద‌ని విమ‌ర్శించిన మంత్రి ఈ విష‌యంలో ఆంధ్రా నేత‌ల‌ను చూసి ప్ర‌తిప‌క్షాలు నేర్చు‌కోవాల్సింది ఎంతో ఉంద‌న్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా  న‌వాబ్‌పేట‌లో సోమ‌వారం మంత్రి క‌ళ్యాణ‌ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ  సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆంధ్రా నాయ‌కులు ఎంతో ఐక్య‌త‌తో ఉంటార‌ని తెలిపారు. ఆంధ్రాలో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ముమ్మ‌రంగా సాగుతుంటే, తెలంగాణలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల పుణ్య‌మా అని పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఆగిపోతోంద‌న్నారు. ప్రాజెక్టులు కట్టొద్దంటూ జిల్లాకు చెందిన కొంద‌రు స‌న్నాసులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నార‌ని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ‌లేని నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి కోర్టుకు వెళ్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు బాగాలేవంటూ జేఏసీ నాయ‌కులు ప్ర‌తిప‌క్షాల‌కు వంత పాడ‌డం స‌రికాద‌ని అన్నారు..

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more