పుల్లుగా తాగి గ‌న్‌తో హ‌ల్‌చ‌ల్ చేసిన నేత‌ల కుమారులు.. జూక‌ల్‌లో రైతు నుదిటిపై తుపాకి గురిపెట్టి చంపేస్తామని బెదిరింపు!

02-01-2017 Mon 08:59 | Telangana
న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు కార్ల‌లో శంషాబాద్ మండ‌లంలో జూక‌ల్‌లోని గ్రీన్ హోం వెంచ‌ర్‌కు చేరుకున్న కొంద‌రు నేత‌ల కొడుకులు అక్క‌డ గ‌న్‌తో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఓ రైతు క‌ణ‌త‌పై తుపాకి గురిపెట్టి చంపేస్తామ‌ని బెదిరించ‌డం క‌ల‌క‌లం రేపింది. డిసెంబ‌రు 31న రాత్రి ప‌దిమంది యువ‌కులు ఫాం హౌస్‌కు చేరుకుని వేడుక‌ల్లో మునిగిపోయారు. రాత్రి 11:30 గంట‌ల స‌మ‌యంలో జూక‌ల్‌కు చెందిన కొంద‌రు యువ రైతులు గ్రీన్ హోం వెంచ‌ర్‌ మీదుగా త‌మ పొలాల‌కు వెళ్తున్నారు. వీరిని చూసిన మ‌ద్యం మ‌త్తులో ఉన్న యువ‌కులు రైతుల‌ను అడ్డుకున్నారు. ఇటువైపు ఎందుకు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌మ పొలాలు ఇటువైపే ఉన్నాయ‌ని, అక్క‌డకు వెళ్లేందుకు ఇదొక్క‌టే దారి అని చెబుతున్నా విన‌లేదు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది.

అంత‌లో మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు జేబులోంచి తుపాకి తీసి శ్రీకాంత్‌రెడ్డి అనే యువ రైతు నుదిటిపై గురిపెట్టాడు. తాను ఎమ్మెల్యే కొడుకున‌ని, ఏం చేస్తారో చేసుకోండ‌ని హెచ్చ‌రించాడు. దీంతో రైతులు తుపాకిని లాక్కున్నారు. విష‌యం తెలిసి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఎస్సై ఖ‌లీల్ పాషాకు తుపాకిని అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై బాధిత‌ యువ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఇప్ప‌టి వ‌రకు కేసు న‌మోదు చేయ‌లేదు. పోలీసులు కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డం వెన‌క జూక‌ల్‌కు చెందిన ఓ నేత హ‌స్తం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఎస్సై ఖ‌లీల్ పాషా మాట్లాడుతూ యువ‌కులు గురిపెట్టిన‌ది బొమ్మ తుపాకి అని కొట్టి  పారేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more