ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం రాజీనామా? త‌మిళ‌నాడులో జోరుగా వ‌దంతులు!

31-12-2016 Sat 06:24 | National
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రో ఉత్కంఠ మొద‌లైంది. ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం రాజీనామా చేయ‌బోతున్నారంటూ శుక్ర‌వారం జోరుగా వదంతులు వినిపించాయి. గురువారం నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం అనంత‌రం తిరిగి వెళ్లిపోతున్న పార్టీ ఎమ్మెల్యేల‌కు పార్టీ అధిష్ఠానం నుంచి వ‌చ్చిన సందేశం క‌ల‌క‌లం రేపింది. చెన్నైలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి చేరుకోవాల‌న్న‌దే దాని  సారాంశం.

పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని శ‌శిక‌ళ‌కు అప్ప‌గిస్తూ తీర్మానం చేసిన‌ స‌మ‌యంలో కొంద‌రు  స‌భ్యులు మాట్లాడుతూ సీఎం ప‌ద‌విని కూడా ఆమెకు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఈ సందేశం అందుకే కాబోలు అని భావించిన ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం రాజ‌నామా చేయ‌బోతున్నార‌ని, శ‌శిక‌ళ సీఎం కానున్నార‌ని అనుకుని శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం క‌ల్లా పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు.

వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు మ‌ళ్లీ పార్టీ కార్యాల‌యానికి రావ‌డంతో పుకార్లు ఊపందుకున్నాయి. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌బోతుంద‌ని అక్క‌డికి చేరుకున్న ఎమ్మెల్యేల‌కు మ‌రో వార్త అందింది. శ‌నివారం పార్టీ ప‌గ్గాలు అందుకోనున్న‌ శ‌శిక‌ళ.. జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించేందుకు రానున్నార‌ని, నేత‌లు సిద్దంగా ఉండాల‌ని క‌బురు అందింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు వ్యాపించిన‌వ‌న్నీ వ‌దంతులేన‌ని తేలింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more