కొత్త సంవత్సరంలో ఇదో లాభం... గృహ రుణ సంస్థల మధ్య పోటీ తీవ్రం.. తగ్గనున్న వడ్డీ రెట్లు!

28-12-2016 Wed 12:09 | Business
కొత్త సంవత్సరంలో సొంతిల్లు సమకూర్చుకోవాలని కలలు కంటున్నారా? మీ కలలు మరింత సులభంగా తీరుతాయని అంటున్నారు నిపుణులు. నోట్ల రద్దు తరువాత ఏర్పడిన ప్రభావంతో, గృహ రుణాల సంస్థల మధ్య పోటీ తీవ్రమై, వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి. ఇండియాలో గృహ రుణాలందిస్తున్న ప్రధాన కంపెనీలైన హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ), ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, డీహెచ్ఎఫ్ఎల్ వంటి కంపెనీలు ఒకటి, రెండు వారాల్లో పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాలను ప్రకటించనున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఈ కంపెనీలన్నీ డిసెంబర్ లో ఎంతో కొంత మేరకు వడ్డీ రేట్లు తగ్గించినవే కావడం గమనార్హం. అయినా, కస్టమర్ల నుంచి రుణాల కోసం డిమాండ్ పెరగకపోవడంతో మరింతగా వడ్డీని తగ్గించాలని ఇవి భావిస్తున్నాయి. నోట్ల రద్దు తరువాత, బాండ్ మార్కెట్ నుంచి సులభంగా నిధుల సేకరణ జరుగుతోందని, ఆ ప్రయోజనాలను రుణ గ్రహీతలకు అందించాలని నిర్ణయించామని ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ గగన్ బంగా వెల్లడించారు. వచ్చే సంవత్సరంలో నూతన ఇండ్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

వడ్డీ రేట్లు తగ్గితే, మరింత మంది రుణాలు తీసుకునేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నట్టు ఇండియాలో అత్యధికంగా గృహ రుణాలు అందిస్తున్న హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ వివరించారు. అక్టోబరులో 8 శాతానికి పైగా వడ్డీని ఆఫర్ చేస్తూ బాండ్లను విక్రయించి రూ. 1000 కోట్లను సమీకరించిన హెచ్డీఎఫ్సీ, నవంబరులో 7.8 శాతం వడ్డీకే రూ. 2 వేల కోట్లను సమీకరించినట్టు తెలుస్తోంది.  ఇదిలావుండగా, నోట్ల రద్దు తరువాత కొంత మేరకు నల్లధనం భారత నిర్మాణ రంగంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కొంతమంది తమ వద్ద ఉన్న అక్రమ ధనంతో స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసినట్టు గుర్తించిన అధికారులు వారిని విచారించాలని భావిస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more