ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ ను చూడ‌డానికి నెటిజ‌న్లు అధిక సంఖ్య‌లో గూగుల్‌లో సెర్చ్ చేశార‌ట‌

21-12-2016 Wed 16:00 | Entertainment
 బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి వెళ్లి బిజీబిజీగా మారిపోయిన న‌టి ప్రియాంక చోప్రా ఈ ఏడాది జరిగిన ఆస్కార్‌ అవార్డుల వేడుకలో తెల్లని దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చి త‌న అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆమె వేసుకున్న డ్రెస్ ‌ను చూడ‌డానికి నెటిజ‌న్లు అధిక సంఖ్య‌లో గూగుల్‌లో సెర్చ్ చేశార‌ట‌.  2016లో త‌మ సెర్చింజ‌న్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల‌ను గురించి గూగుల్ ఒక్కొక్క‌టీ ప్ర‌క‌టిస్తూ వస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా గూగుల్‌ ట్రెండ్‌ ఫలితాలను ప్రకటించి, అందులో ప్రియాంక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ధరించిన దుస్తులు 2016 ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఔట్‌ఫిట్‌’గా నిలిచాయ‌ని పేర్కొంది.

ఈ అంశంపై స్పందించిన లాస్‌ఏంజెల్స్‌లోని ఆమె స్టైలిస్ట్‌ సోఫియా బ్యాంక్స్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ డ్రెస్ ‌ను ప్రియాంక ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఎంచుకున్నట్లు తెలిపారు. తెలుపు రంగులో ఉన్న‌ డ్రెస్ త‌న‌కు బాగా స‌రిపోతుంద‌ని ప్రియాంక అప్ప‌ట్లో అన్నార‌ని, ఇప్పుడు ఆ రంగు డ్రెస్సే ట్రెండ్‌లో ఉంద‌ని అన్నార‌ని చెప్పారు. తెలుపు రంగును చూస్తే తొలిచూపులోనే ఇష్టపడతారని ప్రియాంక త‌న‌కు చెప్పారని సోఫియా తెలిపారు. యూ ట్యూబ్ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’, హాలీవుడ్ సీరియ‌ల్ ‘బేవాచ్‌’ షూటింగ్‌లలో పాల్గొంటూనే ప్రియాంక‌ మాంట్రియల్‌కి వెళ్లి డ్రెస్ ఫిట్టింగ్‌ను చూసుకునేవార‌ని, పర్‌ఫెక్ట్‌ ఫిట్టింగ్‌కి ఎన్నో మార్పులు చేసి, ఫొటోలు తీసి మరీ చూసుకున్నార‌ని ప్రియాంక గురించి సోఫియా వివ‌రించారు.
prianka chopra

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more