నా ప్రేక్ష‌క దేవుళ్ల మ‌ధ్య‌లో కూర్చొని ఈ సినిమా ట్రైల‌ర్‌ను మొద‌టిసారిగా చూశా: బాల‌కృష్ణ‌

16-12-2016 Fri 18:10 | Entertainment
తాను న‌టించిన 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' సినిమా ట్రైలర్‌ విడుద‌ల అవుతున్న వేళ త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని సినీన‌టుడు బాల‌కృష్ణ అన్నారు. 'నా ప్రేక్ష‌క దేవుళ్ల మ‌ధ్య‌లో కూర్చొని ఈ సినిమా ట్రైల‌ర్‌ను మొద‌టిసారిగా చూశా'  అని ఆయన చెప్పారు. సినిమా ట్రైలర్ విడుద‌ల అయిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఇక్క‌డ‌కు వ‌చ్చి కోటి లింగాల స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని, ఆ త‌రువాత‌ ట్రైల‌ర్‌ను లాంఛ్ చేశామ‌ని అన్నారు.  గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి త‌ల్లి గౌత‌మి ఇదే జిల్లాలో పుట్టింద‌ని అన్నారు. ఆమెకు గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి లాంటి గొప్ప రాజు జ‌న్మించాడ‌ని, అటువంటి గొప్ప వ్య‌క్తి పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని అన్నారు.

మ‌నది ఓ బ్ర‌హ్మాండ్‌మైన‌ చ‌రిత్ర అని బాలకృష్ణ అన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చాటిచెప్పార‌ని ఆయ‌న అన్నారు. నంద‌మూరి వార‌సుడిగా ఈ క‌థ‌ను చాటి చెప్ప‌డం తన ధ‌ర్మంగా భావించానని బాల‌య్య అన్నారు. త‌న‌ వందో సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించామ‌ని, ద‌ర్శ‌కుడు క్రిష్‌ అద్భుతంగా ప‌నిచేశాడ‌ని అన్నారు.
balaiah

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more