మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి?.. అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

11-11-2016 Fri 09:59 | National
అణ్వస్త్రాల ప్రయోగంపై భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమంతట తాము ఎవరిపైనా ముందస్తుగా అణ్వస్త్రాలు ప్రయోగించబోమంటూ ఇన్నాళ్లూ భారత్ చెబుతూ వస్తోంది. కానీ, అసలు మనం ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలంటూ ప్రశ్నించి... రక్షణ మంత్రి ప్రకంపనలు పుట్టించారు. ఓవైపు పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పారికర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని... ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆయన తెలిపారు. రక్షణ శాఖ కూడా ఓ ప్రకటన చేస్తూ, అవి పారికర్ వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే అని తెలిపింది. మరోవైపు, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రచారం ఎలా జరుగుతుందో కూడా పారికర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణువిధానాన్ని మార్చుకుందని మీడియాలో వార్తలు వస్తాయని ఆయన అన్నారు. అవసరమైతే భారత్ పై అణుదాడి చేస్తామంటూ పాకిస్థాన్ బెదిరించేదని... మనం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ చాలా సైలెంట్ అయిపోయిందని మంత్రి గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే మనం ఏమైనా చేయగలమనే విషయం అర్థమవుతోందని చెప్పారు.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more