మోదీ నిర్ణయంతో పాక్ షాక్.. ఉగ్రవాదులు, మాఫియాకు కోలుకోలేని దెబ్బ

09-11-2016 Wed 08:27 | National
రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం భారత్‌లోనే కాదు దాయాది పాకిస్థాన్‌లోనూ ప్రకంపనలు రేపింది. మోదీ నిర్ణయం ఆ దేశంలోని ఉగ్రవాదులు, మాఫియాకు కోలుకోలేని దెబ్బే. భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పిస్తున్న పాక్ వారికి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ఇచ్చి పంపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న పాక్ ఆ దేశంలోని ఏకంగా ప్రింటింగ్ ప్రెస్‌లలో పెద్దమొత్తంలో నకిలీ నోట్లను ముద్రిస్తూ ఉగ్రవాదుల ద్వారా భారత్‌కు అక్రమంగా రవాణా చేస్తోంది. రవాణాకు సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.1000, రూ.500 నోట్లనే ఎక్కువగా ముద్రిస్తోంది. పాక్‌లో ముద్రితమవుతున్న ఈ నోట్లను బంగ్లాదేశ్, శ్రీలంక మీదుగా భారత్‌లోకి చొప్పిస్తోంది. ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల నోట్లను భారత మార్కెట్లోకి పాక్ ప్రవేశపెడుతోంది. నకిలీ నోట్లు పెరిగిపోవడంతో అసలు రూపాయల విలువ పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. పాక్ కు కావాల్సింది కూడా ఇదే. మరోవైపు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాఫియా వందల కోట్ల నకిలీ కరెన్సీని చలామణి చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల నకిలీ కరెన్సీ ఉన్నట్టు అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఇదంతా రద్దయినట్టే. కొత్త ఫీచర్లతో నకిలీ నోట్లు ముద్రించాలంటే పాకిస్థాన్ భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకు సమయం కూడా చాలా పడుతుంది. అంటే ఒక్క దెబ్బతో ఇటు దేశంలోని నల్ల కుబేరులను, అటు పాకిస్థాన్‌‌ను ప్రధాని మోదీ చావు దెబ్బ తీశారన్న మాట.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more