సోషల్ మీడియాలో వైరల్ గా మారిన 'అయితే కత్తిరించుకో' మెసేజ్
తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ గా మారింది. ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో ఈ మేసేజ్ గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య సంభాషణ అయిన ఈ మెసేజ్ వివరాల్లోకి వెళ్తే...
భార్య: ఏమండీ నా జుట్టు కొంచెం కత్తిరించుకోవాలా?
భర్త: కత్తిరించుకో.
భార్య: ఎంతకష్టపడి పెంచుకున్నానో తెలుసా?
భర్త: అయితే కత్తిరించుకోకు.
భార్య: ఇప్పుడు అందరూ కత్తిరించుకుంటున్నారు..అదే ఫ్యాషన్
భర్త: అయితే కత్తిరించుకో.
భార్య: ఒకవేళ నేను కత్తిరించుకున్నాక ఫ్యాషన్ మారిపోతే.
భర్త: అయితే కత్తిరించుకోకు.
భార్య: మా ఫ్రెండ్స్ అందరూ నాకు చిన్న జడనే బాగుంటుంది అని అంటుంటారు.
భర్త: అయితే కత్తిరించుకో.
భార్య: నా చిన్న ఫేస్ కి చిన్న జడ బాగుండదేమో అనిపిస్తుందండీ
భర్త: అయితే కత్తిరించుకోకు.
భార్య: చిన్న జడయితే దువ్వుకోవడం తేలిక..ఏమంటారు?
భర్త: అయితే కత్తిరించుకో.
భార్య: పెద్ద జడని కట్ చేస్తే పూలు పెట్టుకోవడం కుదరదనిపిస్తోంది..పర్లేదా?
భర్త: అయితే కత్తిరించుకోకు.
భార్య: ఒకసారి ప్రయోగం చేసి చూస్తే ఎలా ఉంటుంది?
భర్త: అయితే కత్తిరించుకో.
భార్య: మళ్ళీ వెంట్రుకలు పెరగాలంటే చాలా టైం పడుతుందని బెంగగా ఉంది.
భర్త: అయితే కత్తిరించుకోకు.
భార్య: పోనీ ఓ సారి కట్ చేయించుకొని చూడానా?
భర్త: అయితే కత్తిరించుకో.
భార్య: మరి కట్ చేయించుకున్నాక బాగాలేకపోతే ఎలా?
భర్త: అయితే కత్తిరించుకోకు.
ప్రస్తుతం ఆ భర్త ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో 'అయితే కత్తిరించుకో, అయితే కత్తిరించుకోకు', 'అయితే కత్తిరించుకో' అంటూ చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లకి ఇప్పటికీ అంతుచిక్కడం లేదు, దేన్ని కత్తిరించమంటున్నాడు.. అంతలోనే వద్దని ఎందుకంటున్నాడని. అతనిపై విదేశీ వైద్య బృందం పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇందులో నీతి: ఒక్కోసారి మౌనం కూడా చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది... అంటూ ముగుస్తోందీ మెసేజ్...ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.