అప్పుడు నా మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశా.. బోపన్న, నేను మాట్లాడుకోలేదు: సానియా మీర్జా

05-11-2016 Sat 09:12 | Sports
ఒలింపిక్స్‌లో కొద్దిలో పతకం చేజార్చుకున్నాక తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతా ఇంతా కాదని టెన్సిస్ స్టార్ సానియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పతక పోరు ముగిసిన రెండు గంటల్లోనే తాను, బోపన్న కలిసి సిన్సినాటి టోర్నీకి బయలుదేరామని చెప్పిన సానియా దాదాపు గంట పాటు తామిద్దరం ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదని, తన మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశానని పేర్కొంది. ఓటమి తర్వాత వర్ణించలేనంత బాధను అనుభవించామని తెలిపింది. ఒలింపిక్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఉంటే అంతగా బాధపడి ఉండేవాళ్లం కాదని, కానీ తృటిలో పతకాన్ని చేజార్చుకోవడంతో తన గుండె పగిలినట్టు అయిందని తెలిపింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం కూడా చిన్న విషయమేమీ కాదని పేర్కొంది. అయితే లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం తమను బాధించిందని వివరించింది. పోరు ముగిశాక క్రీడా గ్రామం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి 1:15 గంటలు పట్టిందని, ఆ సమయంలో ఒకటి రెండు మాటలు తప్పితే పెద్దగా మాట్లాడుకోలేదని పేర్కొంది. ‘‘బాధపడకు, వచ్చేసారి చూద్దాం’’ వంటి సందేశాలు తనకు ఇష్టముండదని, అందుకే సెల్ స్విచ్చాఫ్ చేశానని వివరించింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more