ఈనెల 13న జరగాల్సిన 2011 గ్రూపు-1 మెయిన్స్ (రీఎగ్జామ్) జనరల్ ఇంగ్లీషు పరీక్షను వాయిదా వేశారు. బక్రీద్ పండగను పురస్కరించుకుని ఈ పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చిందని టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను తిరిగి 24వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు ముందు ప్రకటించిన ప్రకారమే యథాతథంగా జరుగుతాయని, ఈ పరీక్షలను ఒక్క హైదరాబాద్ కేంద్రంలోనే నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించినట్లు తెలిపారు.
జనరల్ ఇంగ్లీషు మినహా మిగతా పరీక్షలను ఇంగ్లీషు లేదా తెలుగు లేదా ఉర్దూ భాషల్లో రాయవచ్చని పేర్కొన్నారు. అయితే, ఒక పేపరులో కొంత భాగం ఒక భాషలో .. మరికొంత భాగం వేరే భాషలోనూ రాస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరగదన్నారు. హాల్ టికెట్లను ఈరోజు అర్ధరాత్రి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు ఆ ప్రకటనలో సూచించారు.
More Telugu News
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి
-
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
-
డిసెంబర్లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం