శివుడు సంతోషిస్తాడనే ఆ వేషంలో తిరుగుతున్నాను: దొంగ స్వామీజీ కేశవతీర్థ
తానే శివుడినని చెప్పుకుంటూ ఆ వేషధారణలో తిరుగుతున్న దొంగ స్వామీజీ కేశవతీర్థ మాట మార్చాడు. తాను శివుడినని చెప్పలేదని, తన నాడీ జ్యోతిష్యంలో మాత్రం ఆ విధంగా వుందని చెబుతున్నాడు. కేవలం శివుడు సంతోషిస్తాడనే ఆ వేషధారణలో తిరుగుతున్నానని సమర్థించుకున్నాడు. ఎవరినీ తాను మోసం చేయలేదని, ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని చెప్పాడు. తాను రామదేవర సజీవ సమాధి దగ్గరకు వెళ్లి పూజలు చేశానని, తన వద్ద ఉన్న బంగారం కోసం అక్కడి దొంగలు తనపై దాడి చేశారన్నారు. తానే రామదేవరనని చెప్పినందుకు ఈ దాడి చేశారంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒకప్పుడు తాను మంచి హీరోనని, తన కాల్షీట్ల కోసం నిర్మాతలు వెంటపడేవారని దొంగస్వామి కేశవతీర్థ మరో కొత్త కథ చెప్పాడు.