సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ పొంగులేటి లేఖ
బయ్యారం గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గనులను రక్షణ స్టీల్ సంస్థకు అప్పగిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకించామని, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిని రద్దు చేయించామని ఆ లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించాలని ఆ లేఖలో పొంగులేటి కోరారు.