ఐపీఎస్ అవతారం ఎత్తిన పంజాబ్ మాజీ మంత్రి మనవడు... 60 మందిని బురిడీ కొట్టించిన వైనం!

18-06-2016 Sat 16:13 | National
పంజాబ్ లో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారులు తమ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే అవినీతి కేసు పెడతామని బెదిరిస్తున్నారంటూ అమృత్ సర్ డివిజన్ అటవీశాఖాధికారి ఎస్.కే.సాగర్ పోలీసులకు గత నెల ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్, పోలీసు అధికారులు నిఘా వేసి నకిలీ ఐపీఎస్ అధికారి రాహుల్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ మేరకు అమృత్ సర్ సీనియర్ ఎస్పీ పాటిల్ కే బలరామ్ మాట్లాడుతూ, రాహుల్ కుమార్ విజిలెన్స్ ఎస్పీగా పరిచయం చేసుకుని సుమారు 60 మందికిపైగా ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించాడన్నారు. వారి నుంచి సుమారు 30 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని వసూలు చేశాడని ఆయన వెల్లడించారు. కాగా, రాహుల్ కుమార్ పంజాబ్ మాజీ మంత్రి జ్ఞాన్ చంద్ మనవడు, దీనానగర్ మాజీ ఎమ్మెల్యే రూప్ రాణి కుమారుడని ఆయన తెలిపారు. రాహుల్ చేతిలో మోసపోయిన వారిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ర్యాంక్ అధికారులు, జిల్లా ఆహార సరఫరా కంట్రోలర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా వైద్యశాఖ అధికారి, సహకార సంఘాల అధికారులు, రోడ్డు రవాణ అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. రాహుల్ ను విచారిస్తున్నామని, ఆయన అధికారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశాడన్నది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more