వైసీపీకి మరో షాక్!... నేడు సైకిలెక్కనున్న పలమనేరు ఎమ్మెల్యే!

16-06-2016 Thu 06:31 | Both States
ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. తాను తలచుకుంటే గంటల వ్యవధిలో టీడీపీ సర్కారును కూల్చేస్తానని వైసీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సింగిల్ వ్యాఖ్యతో ‘ఆకర్ష్’కు తెర లేపిన టీడీపీ... గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 19 మందిని లాగేసింది. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్ నాథ్ రెడ్డి నేడు టీడీపీలో చేరిపోతున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్న అమర్... గడచిన ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన సునాయాసంగానే విజయం సాధించారు. అయితే వైసీపీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చిన అమర్... తన సొంత గూడు టీడీపీ వైపు చూశారు. అమర్ నాథ్ రెడ్డి రీఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి పార్టీ బెజవాడ భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో అమర్ టీడీపీలోకి చేరుతున్నట్లు దాదాపుగా రూడీ అయిపోయింది. అదే క్రమంలో చడీ చప్పుడు లేకుండా నిన్న సాయంత్రం టీడీపీ విశ్వసనీయ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చేసింది. దీని ప్రకారం, నేడు అమర్ నాథ్ రెడ్డి... పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న అమర్ నాథ్ రెడ్డి... మరికాసేపట్లో చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుస్తారని, నేటి రాత్రి 7 గంటల సమయంలో ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more