ఇండియన్‌ సెక్యూరిటీ రీస‌ర్చర్స్ కు ఫేస్‌బుక్ రూ.4.84 కోట్ల రివార్డు

18-03-2016 Fri 18:04 | International
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ఇండియన్‌ సెక్యూరిటీ రీస‌ర్చర్ల‌కు భారీ రివార్డు అందించింది. హ్యాకర్లు ఫేస్‌బుక్ యూజ‌ర్ల అకౌంట్ల‌లోకి ప్ర‌వేశించి, వారి వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కొట్టేసే వీలున్న బగ్స్ పై స‌దరు సంస్థకు స‌మాచారాన్ని అందించినందుకు గానూ ఇండియన్‌ సెక్యూరిటీ రీస‌ర్చర్ల‌కు ఫేస్‌బుక్‌ రూ.4.84 కోట్లు బహుమతిగా ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో హ్యాకింగ్‌కు కార‌ణ‌మయ్యే బ‌గ్‌ల‌ను క‌నిపెట్టే రీసర్చ‌ర్లు ఉన్న దేశాల్లో ఇండియానే అగ్రస్థానంలో వుందని ఆ సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. భారత్ నుంచి 205 మంది సెక్యూరిటీ రీస‌ర్చ‌ర్లు ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు వెల్ల‌డించింది. దీంతో ఫేస్‌బుక్ నుంచి రూ.4.84కోట్లను అందుకున్న దేశంగా ఇండియన్ రీస‌ర్చ‌ర్లు టాప్ ప్లేస్‌లో నిలిచార‌ని ఆ సంస్థ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో హ్యాకింగ్ కు కార‌ణ‌మ‌య్యే బ‌గ్‌ల‌ను క‌నిపెట్టే ప్రోగ్రాంని ఆ సంస్థ 2011లో మొద‌లుపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రీస‌ర్చ‌ర్ల నుంచి 2,400 వాలిడ్ స‌బ్మిష‌న్లు స్వీక‌రించింది. దీనికి గానూ మొత్తం 4.3 మిలియ‌న్ల యూఎస్ డాల‌ర్ల ప్రోత్సాహ‌కాన్ని 8 వంద‌ల మందికి అందించింది.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more