మూడు పదుల వయసు కూడా దాటకుండానే తెల్లజుట్టు వచ్చేస్తోందా? దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. కుటుంబ పరమైన జన్యు లోపాలు, పని ఒత్తిడి, రక్తహీనత, శరీరంలో విటమిన్ల లోపం వంటి కారణాలతో తెల్ల జుట్టు వస్తుంటుంది. జుట్టుకు రంగు వేసుకుంటే అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండే ప్రొడక్టులతోనే ఇంట్లోనే చికిత్స ద్వారా తెల్లజుట్టును తగ్గించుకోవచ్చు. ఎలాగంటే...
కొబ్బరినూనె, కరివేపాకు: నిత్యమూ కొబ్బరినూనె తలకు పెట్టుకోవడం వల్ల అది సహజ కండిషనర్ గా పనిచేస్తుంది. పొడిబారిన కురులను మృదువుగా మారుస్తుంది. ఇక కరివేపాకులోని బీ-విటమిన్ జట్టుకు నల్లదనాన్ని పెంచుతుంది. ఇందులోని బీటా కెరోటిన్ సైతం ఇందుకు ఉపకరిస్తుంది. కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులు వేసి వేడి చేసి, కరివేపాకు నల్లగా మారాక దింపేసి తలకు మృదువుగా మర్దన చేసుకుని, ఆపై షాంపూతో కడిగేయాలి. ఇలా మూడు వారాలు చేసి చూడండి!
మెంతులు, ఉసిరి: మెంతుల్లో ఐరన్, పొటాషియంలతో పాటు ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇక ఉసిరిలోని విటమిన్ సి తలపై ఉన్న తెల్ల వెంట్రుకలు మరింత బలహీనపడి రాలిపోకుండా చేస్తుంది. మెంతుల్లోని సద్గుణాల కారణంగా జుట్టు సహజసిద్ధంగా నల్లబడుతుంది. కొబ్బరినూనెలో ఐదు ఎండు ఉసిరికాయలు వేసి వేడి చేసి ఐదు నిమిషాల తరువాత మెంతుల పొడిని కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రిళ్లు తలకు రాసుకుని మర్నాడు కడిగేసుకుని చూడండి... త్వరలోనే తెల్లజుట్టు సైతం నల్లగా మారడాన్ని గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్