ఆయన నన్ను 'పొట్టోడా' అని పిలిస్తే...నేను అతన్ని 'బండోడా' అనేవాణ్ణి!: అమితాబ్ బచ్చన్

14-08-2015 Fri 21:19 | Entertainment
40 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించి, భారత దేశ చలన చిత్ర చరిత్రలో తన కోసం ఓ పేజీ కేటాయించేలా చేసుకున్న సినిమా 'షోలే'. ఈ సినిమా రిలీజై 40 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. 'షోలే' సినిమా స్క్రిప్టు వినిపించినప్పుడు 'గబ్బర్ సింగ్' పాత్ర పోషిస్తానని దర్శకుడు రమేశ్ సిప్పీకి, సినీ రచయితలు సలీం-జావెద్ కు అమితాబ్ సూచించారట. అయితే ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన దర్శకుడు 'జై' పాత్ర పోషించాలని సూచించారట. 'గబ్బర్ సింగ్' పాత్రకు డానీ డెంజోంగ్ పాను తీసుకోవాలని భావించి ఆయనకు కధ వినిపించారట. ఆయన డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో అమ్జాద్ ఖాన్ ను సంప్రదించారట. దీంతో, 'గబ్బర్ సింగ్' పాత్రకు అమ్జాద్ ఖాన్ ను సలీం-జావెద్ సూచించారని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అమ్జాద్ టాలెంట్ పై చాలా మందికి అనుమానం ఉండేదని, తనకు మాత్రం డౌట్ లేదని, అందరి అంచనాలను ఆయన పటాపంచలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అమ్జాద్ ను చూసి అందరూ భయపడేవారని, అంతలా ఆయన ఆ పాత్రలో నటించారని బిగ్ బీ చెప్పారు. అప్పట్లో అమ్జాద్ ఖాన్ తనను సరదాగా 'పొట్టోడా' అని పిలిచేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఆయనను 'బండోడా' అని పిలిచేవాడినని ఆయన తెలిపారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more