బెంగళూరు ఎన్నికల ప్రచారానికి చిరంజీవి, ఖుష్బూ
బృహత్ బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో, ఎన్నికల్లో విజయం సాధించడానికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఓటర్లను ఆకర్షించేందుకు సినీ స్టార్లను రంగంలోకి దించనుంది. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్లు రమ్య, భావనలను ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించింది. వీరితో పాటు చిరంజీవి, ఖుష్బులను కూడా ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. మరోవైపు రెండోసారి బీబీఎంపీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి బీజేపీ ఎత్తులు వేస్తోంది.