ఎంత ఘోరం...ఉద్యోగం అని చెప్పి ఆమెను అమ్మేశారు!
నిరుద్యోగులను నిలువునా ముంచేవారు సమాజంలో అడుగడుగునా తారసపడుతుంటారు. డబ్బు దోచుకునే వారు కొందరైతే, ఉద్యోగం ముసుగులో యువతులను విక్రయించేవారు మరి కొందరు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో విదేశీ ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న ముఠా గుట్టును ఓ మహిళ బయటపెట్టింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన అజురా బేగంను దుబాయ్ లో ఉద్యోగం పేరిట ఈ ముఠా బుట్టలో వేసుకుంది. బెంగళూరు తీసుకెళ్లిన ముఠా, అక్కడ వ్యభిచార గృహానికి ఆమెను అమ్మేసింది. ఎలాగోలా తప్పించుకుని హైదరాబాదు చేరుకున్న ఆమె, హెచ్చార్సీని ఆశ్రయించింది. తనలాగే వ్యభిచార రొంపిలో మరో 20 మంది ఇరుక్కున్నారని, వారిని విడిపించాలని ఆమె హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది.