ఈ నెల 28 నుంచి బ్యాంకులకు వరుస సెలవులు
దేశంలో బ్యాంకులకు ఒక్కసారిగా సెలవులు వచ్చిపడ్డాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వరకు బ్యాంకులకు దీర్ఘకాలిక సెలవులు వస్తున్నాయి. ఈ నెల 28న శ్రీరామనవమి, 29, ఏప్రిల్ 1 తేదీల్లో అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా బ్యాంకులు సెలవులు పాటించనున్నాయట. అయితే మార్చి 30, 31 తేదీల్లో కొన్ని బ్యాంకులు మాత్రమే పని చేస్తాయి. ఇక ఏప్రిల్ 2న మహవీర్ జయంతి, 3న గుడ్ ఫ్రైడే కాబట్టి బ్యాంకులకు ఎలాగూ సెలవులు ఉంటాయి. 4న శనివారం బ్యాంకులు పనిచేసినా మధ్యాహ్నం వరకు, ఇక ఆ మరుసటి రోజే అంటే 5న ఆదివారం ఎలాగూ సెలవు ఉంటుంది. ఇలా వరుస సెలవులతో ఈసారి బ్యాంకు ఉద్యోగులకు కొంత ఊరట కలిగినా... కస్టమర్లు మాత్రం ఇబ్బందులు పడనున్నారు.