రోజా... నీ పర్సనల్ వీడియోలు బయటకు తీస్తా: బొండా ఉమ

18-03-2015 Wed 21:04 | Both States
ఏపీలో అసెంబ్లీలో బుధవారం చోటుచేసుకున్న రగడపై ఓ టీవీ చానల్ టీడీపీ నేత బొండా ఉమ, వైసీపీ నేత రోజాలతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, సభలో జరిగిన విషయాలకు సిగ్గుతో తలదించుకుంటున్నానని అన్నారు. టీడీపీ సభ్యులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. విడుదల చేసిన ఫుటేజ్ లో వాస్తవాలు లేవని అన్నారు. తమకు కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సిగ్గు పడాల్సింది బొండా ఉమ, పీతల సుజాత తదితరులేనని రోజా మండిపడ్డారు. అందుకు బొండా ఉమ చురుగ్గా స్పందించారు. అసెంబ్లీలో పోడియం వద్ద దృశ్యాలు చూస్తే సిగ్గుపడాల్సింది ఎవరో స్పష్టమవుతుందని కౌంటర్ విసిరారు. దీనికి రోజా బదులిస్తూ, తాను కేవలం నిరసన వ్యక్తం చేశానని అనగా, చెప్పులు చూపించడం, చంపేస్తానని అనడం నిరసన కిందకు వస్తుందా? అని ఉమ ప్రశ్నించారు. "మీ కొడుకు ఎవరినో కారుతో గుద్ది చంపేసిన కేసులో ఎలా బయటపడ్డారో చెప్పగలరా?" అంటూ రోజా సవాల్ విసరగా, "రోజా... నీ పర్సనల్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వాటిని బయటకు తీస్తా" అని హెచ్చరించారు. ఈ దశలో చర్చ పక్కదారి పడుతోందని భావించిన కార్యక్రమ సంధానకర్త ఇరువురిని మళ్లీ టాపిక్ దిశగా మళ్లించారు. అంతకుముందు, మధ్యలో ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన పీతల సుజాత కూడా రోజాపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more