ఉగాది పురస్కారాలు ప్రకటించిన తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత నిర్వహిస్తున్న తొలి ఉగాది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా అందజేసే ఉగాది పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రకటించింది. పురస్కార విజేతల ఎంపిక కమిటీ తయారుచేసిన నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. తెలంగాణలో అన్ని కళలకు ప్రాధాన్యమిస్తూ పలువురు ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేశారు.
సాహిత్య రంగం - ముదిగంటి సుజాతా రెడ్డి, మలయశ్రీ, గోరెటి వెంకన్న
సంగీతం విభాగం - రామలక్ష్మి, రంగాచారి, రాజగోపాలాచారి
నృత్యం విభాగం - సుధీర్ రావు, రత్నశ్రీ
నాటక రంగం - దాసరి అమరేందర్
ఒగ్గుకథ - ఒగ్గు ధర్మయ్య
మిమిక్రీ విభాగం - సదాశివ
చిత్రకళ - సూర్యప్రకాశ్, అంజనీరెడ్డి
శిల్పకళ - శ్రీనివాసరెడ్డి, పాండు
పేరిణి నృత్యం - పేరిణి రమేశ్
జానపద సంగీతం- వడ్డేపల్లి శ్రీనివాస్
జానపద కళా రూప ప్రదర్శన - దర్శనం మొగులయ్య
హరికథ - పద్మాలయాచార్య
బుర్రకథ - సరోజిని
చిందు యక్షగానం - చిందు పెద్దబాబయ్య
టీవీ రంగం - నాగబాల సురేశ్
సినిమా రంగం - ఎన్.శంకర్, భూపాల్ రెడ్డి
జానపద చిత్రకళ - ప్రకాశ్ వైకుంఠం, చేర్యాల
హస్తకళ - నల్ల విజయ్, హుజూరమ్మ
కళాశ్రమం - రవీంద్రశర్మ
వేదపరిశోధన విభాగం - ఎంవీ నర్సింహరెడ్డి
ఇదిలాఉంటే ఉగాది పురస్కారాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి పెరిగింది. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఒక్కో పురస్కారానికి ఇచ్చే మొత్తాన్ని రూ.5,116 నుంచి రూ.10,116కి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.