రేయ్, ఏంట్రా మాట్లాడేది?... అంతు చూస్తా!: కొడాలి నానికి బోండా ఉమ హెచ్చరిక
ఏపీ అసెంబ్లీలో తిట్ల పురాణం వినిపించింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంలో దూషణల పర్వం కొనసాగింది. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా మహేశ్వరరావులు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బోండా ఉమ మాట్లాడుతూ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని), రోజాలను ఐరెన్ లెగ్ లుగా అభివర్ణించారు.
దీంతో కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రసంగం మధ్యలోనే ఆగ్రహోదగ్రుడైన బోండా ఉమ ‘‘రేయ్, ఏంట్రా మాట్లాడేది? అంతు చూస్తా... వేలాడదీస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మైక్ లో బిగ్గరగా వినిపించడంతో సభ దద్దరిల్లింది. సభ అదుపు తప్పింది. దీంతో స్పీకర్ కోడెల సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.