ఆ సినిమా పూర్తి చేసేందుకు కొత్త 'బ్రూస్ లీ' బయల్దేరాడు!

17-03-2015 Tue 20:23 | International
మార్షల్ ఆర్ట్స్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన బ్రూస్ లీ ప్రేరణగా అప్పట్లో ఎందరో 'డిష్యుం, డిష్యుం' సినిమాలతో అలరించేందుకు బయల్దేరారు. బ్రూస్ లీ సినిమాలతో ఉత్తేజం పొందిన జాకీచాన్, జెట్ లీ, వాన్ డామ్ తదితరులు ఈ కోవలోకే వస్తారు. అయితే, చిన్న వయసులోనే బ్రూస్ లీ మరణించడంతో ఎంటర్ ది డ్రాగన్, ద బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ వంటి హిట్ చిత్రాలే అభిమానులకు అతని స్మృతిగా మిగిలాయి. ఇదిలా ఉంటే, ఇటీవల ఆప్ఘనిస్థాన్ కు చెందిన అబ్బాస్ అలీ జాదా అనే వ్యక్తి అచ్చు గుద్దినట్టు బ్రూస్ లీలా ఉండడంతో వార్తల్లోకెక్కాడు. ఇతగాడు కూడా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడే. మనవాడికి కూడా బ్రూస్ లీనే ఆదర్శం! ఇప్పుడు అలీ జాదా ఆఫ్ఘన్ లో ఓ సెలబ్రిటీ. ఇతనికో లక్ష్యం ఉందట. బ్రూస్ లీ 1973లో చనిపోయే నాటికి అసంపూర్ణంగా మిగిలిపోయిన 'గేమ్ ఆఫ్ డెత్' సినిమాను పూర్తి చేయాలన్నదే ఆ లక్ష్యం. దీనిపై అలీ జాదా మాట్లాడుతూ... "బ్రూస్ తన చివరి చిత్రాన్ని పూర్తిచేయలేదు. సగం మాత్రమే చేశాడు. ఇప్పుడు నా ప్రాజెక్టు ఆ సినిమాను పూర్తిచేయడమే" అని వివరించాడు. అతని కోరిక నెరవేరుతుందో? లేదో? కాలమే చెప్పాలి.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more