దమ్ముంటే... నాపై పోటికి దిగండి: చంద్రబాబుకు తలసాని సవాల్!

10-02-2015 Tue 08:52 | Both States
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. గతంలో పార్టీ అధినేత హోదాలో చంద్రబాబును కీర్తించిన తలసాని, పార్టీ మారగానే బద్ధ విరోధిలా మారిపోయారు. దమ్ముంటే, తనపై పోటీ చేయాలని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు. నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా తలసాని, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు షో పుటప్ చేస్తున్నడు. నేను టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెట్టేలా మాట్లాడాలని చెప్పాడు. దీనిని మూడు సార్లు తిరస్కరించాను’’ అని తలసాని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. మరి తలసాని సవాల్ పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more