ఆస్ట్రేలియాకు చెందిన బ్రూక్ వేల్ యూనియన్ బ్రూవరీ తీరు మార్చుకోలేదు. 2013లో హిందూ దేవుళ్ల బొమ్మలను బీరు బాటిళ్లపై ముద్రించిన ఈ మద్యం తయారీ కంపెనీ ఆ తర్వాత ఎదురైన వ్యతిరేకత నేపథ్యంలో క్షమాపణలు చెప్పింది. అయితే, లక్ష్మీదేవి, గణేశుడు తదితరుల బొమ్మలను ముద్రించిన బీరు సీసాల విక్రయాన్ని మాత్రం కొనసాగిస్తోంది. అప్పట్లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం అధ్యక్షుడు రాజన్ జేడ్ దీనిపై ఆందోళన చేపట్టారు. దీంతో, బ్రూక్ వేల్ యూనియన్ హిందూ సమాజానికి క్షమాపణ తెలిపింది.
ఆ కంపెనీ తీరు మార్చుకోకపోవడంపై ఆయన తాజాగా స్పందించారు. అమెరికాలోని నెవాడా నుంచి ఓ ప్రకటన చేశారు. హిందూ దేవుళ్లను, మత చిహ్నాలను దుర్వినియోగపర్చడం భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. లక్ష్మీదేవి, గణేశుడు భారత్ లో విశేషంగా పూజలందుకుంటారని, అలాంటి వారిని ఆలయాల్లో పెట్టి ఆరాధించాలేగానీ, డబ్బు కోసం బీరు సీసాలపై ముద్రించడం సరికాదని హితవు పలికారు.
More Telugu News
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి
-
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
-
డిసెంబర్లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం