పిల్లికి మందిరం కట్టాడు!

02-01-2015 Fri 17:59
లక్నోకు చెందిన ఫ్రాంక్ హుజూర్ ఒక్క పుస్తకంతో ఎంతో పేరుపొందాడు. 36 ఏళ్ల హుజూర్ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ జీవిత చరిత్ర 'ఇమ్రాన్ వర్సెస్ ఇమ్రాన్-ద అన్ టోల్డ్ స్టోరీ'తో ఎంతో పాప్యులర్ అయ్యాడు. ఈ యూపీ రాష్ట్రీయుడికి పిల్లులంటే ఎంతో ప్రేమ. ప్రస్తుతం అతని వద్ద 28 పిల్లులున్నాయట. అతనికి పిల్లులంటే ఎంత ప్రేమంటే, తనకిష్టమైన బొకా అనే పిల్లి చనిపోతే, దానికోసం తన లక్నో నివాసంలో మందిరం కట్టాడు. అందులో తెల్లని పిల్లి విగ్రహం నిలబెట్టాడు. గత మంగళవారం ప్రార్థన చేసిన అనంతరం ఆ మందిరాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచారు. పర్షియన్ జాతికి చెందిన బొకా సెప్టెంబర్ 27న మరణించింది. దీనిపై హుజూర్ మాట్లాడుతూ, అన్ని పిల్లుల్లాగానే బొకా కూడా తనతో ఎంతో సన్నిహితంగా ఉండేదని తెలిపాడు. అది పిల్లి మాత్రమే కాదని, దాంతో తనకు దివ్యమైన అనుబంధం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన వద్ద ఉన్న పిల్లుల్లో 20 పిల్లులకు బొకానే తండ్రి అని వివరించాడు. మూడు ఆడపిల్లులతో జతకూడి ఈ సంతానం పొందిందని పేర్కొన్నాడు. కాగా, 2012లో మొదలైందట హుజూర్ పిల్లుల ప్రేమ. వీధుల్లో తిరిగే ఓ పిల్లి తన ముంబయి నివాసంలోకి వచ్చి, అక్కడే ఆవాసం ఏర్పరచుకుందట. దానికి మిల్లీ అని పేరుపెట్టి, తన పిల్లుల సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు హుజూర్.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more