: జానకీరామ్ ఫేస్ బుక్ నిండా తన తాత ఎన్టీఆర్ స్మృతులే!

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ నిత్యం తన తాత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు స్మృతులతోనే కాలం వెళ్లదీసేవారట. తాతపై తనకున్న ఇష్టానికి నిదర్శనంగానే తన కుమారుడికి నందమూరి తారక రామారావు అనే పేరును పెట్టుకున్నారు. తాతతో తన స్మృతులను నెమరువేసుకునే క్రమంలో జానకీరామ్ తన ఫేస్ బుక్ ను తాతతో తను దిగిన ఫొటోలతో నింపుకున్నారట. అంతేకాక ఎన్టీఆర్ కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను కూడా జానకీరామ్ భద్రంగా దాచుకున్నారు. జానకీరామ్ మృతి నేపథ్యంలో... 1977లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'చాణక్యచంద్రగుప్త' సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిన్నారి జానకీరామ్ ను ఎత్తుకుని ఉన్న ఫొటో ఫేస్ బుక్ లో దర్శనమిచ్చింది. నాడు తన తాత ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి ఫొటో దిగే అవకాశం రావడం తన అదృష్టమేనని ఆ ఫొటోకు జానకీరామ్ తన వ్యాఖ్యను జోడించారు.

More Telugu News