భర్తకు బుద్ధి చెప్పిన భార్య
అక్రమ సంబంధం నెరపుతున్న భర్తకు ఓ భార్య తగిన శాస్తి చేసింది. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ బాబు-అరుణలకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఐదేళ్ల పాటు సాఫీగా సాగిన కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త ఇంట్లో వేరే మహిళతో ఉండడాన్ని చూసిన అరుణ, ఇంట్లోంచి అతనిని బయటకు ఈడ్చి దేహశుద్ధి చేసింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది, అతనిని అదుపులోకి తీసుకున్నారు.