చదువుకున్న వారిలోనే అధిక అవినీతి
నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యుల్లోనే అవినీతి ఎక్కువగా కనిపిస్తోందని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడే వారంతా సంస్కార హీనులని ఆయన అన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నైతిక విలువలను మరువకుండా, సంపాదించిన జ్ఞానాన్ని దేశ ప్రయోజనాలకు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో నిజాయతీ గల వ్యక్తుల కంటే అవినీతిపరులే అధికంగా ఉండడం శోచనీయమన్నారు. బెంగళూరులో జరిగిన భారతీయ సంస్కృతి విద్యాపీఠ స్వర్ణోత్సవాల్లో ఆయన మాట్లాడారు.