ఇసుక కావాలంటే ఈ సేవ, మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సిందే!
గృహ నిర్మాణ అవసరాల కోసం ఇసుక కావాలంటే ఈ సేవ, మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడు తామే సరఫరా చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందనరావు తెలిపారు. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లకు కూడా ఇసుక లారీలను తనిఖీ చేసే అధికారం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తీరుతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.