ఇండో-జర్మన్ పరస్పర సహకారంపై చర్చించాం: దత్తాత్రేయ
జర్మన్ రాయబారి బృందంతో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమావేశం ముగిసింది. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, ఇండో-జర్మన్ సహకారంపై చర్చించామని చెప్పారు. కార్మికుల్లో నైపుణ్యం పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని... దాంతో, మన కార్మికులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. మేడ్చల్ లో వృత్తి విద్య యూనివర్శిటీకి సహకరించాలని జర్మనీ ప్రతినిధులను కోరానని చెప్పారు.