మైనింగ్ ఏడీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో మైనింగ్ ఏడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీని సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్ ను ఆదేశించారు. ఏడీ 3 నెలలుగా ఇసుక అక్రమ తవ్వకాలు గుర్తించడంలో విఫలమయ్యారంటూ మంత్రి మండిపడ్డారు. మైనింగ్ విభాగంలో దిగువస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ముడుపుల ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠ పతనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.