శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఫోర్డ్ కారు దగ్ధం
హైదరాబాదులోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తు ఓ ఫోర్డ్ కారు మంటల్లో చిక్కుకుంది. కారు నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఫైరింజన్లు సంఘటనా స్థలికి ఇంకా చేరుకోలేదు. సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.