జపాన్ లో ఎన్ఐడీఈసీ చైర్మన్ షిహనోబు నోరితో చంద్రబాబు భేటీ
జపాన్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఎన్ మార్ సంస్థ ప్రతినిధులతో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు ఎన్ఐడీఈసీ చైర్మన్ షిహనోబు నోరితో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఎన్ఐడీఈసీ ప్రతినిధులకు బాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతకుముందు, ఎన్ మార్ ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు వ్యవసాయ పనిముట్ల తయారీలో ఎన్ మార్ విధానాలను పరిశీలించారు. వ్యవసాయ పనిముట్ల తయారీలో సాయపడాలని ఎన్ మార్ ను కోరారు.