నా ఆట బాగాలేదు, అందుకే ఓడిపోయా: విశ్వనాథన్ ఆనంద్
ప్రత్యర్థితో పోలిస్తే తన ఆటతీరు అసంతృప్తికరంగా వుందని చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ను ఆనంద్ దూరం చేసుకున్న సంగతి తెలిసిందే. కార్ల్ సన్ తో చివరి మ్యాచ్ పై తన అభిప్రాయం చెబుతూ, "చాలా ఉద్వేగభరిత క్షణాలవి. 27వ ఎత్తును 'బీజీ7' వేస్తే ఇద్దరి బలాలు సమానంగా ఉండేవి. అయితే నా జూదం ఫలించలేదు. అందుకు తగిన శిక్ష పడింది. ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమది. మొత్తంగా చూస్తే నల్ల పావులతో నేను బాగానే ఆడాను. అయితే మాగ్నస్ కార్ల్ సన్ నాకన్నా మెరుగ్గా ఆడాడని అంగీకరించాలి" అన్నాడు. ఆటలో కార్ల్ సన్ కన్నా తానే బలహీనంగా కనిపించానన్నాడు. ఈ ఓటమితో తాను చెస్ మానేయాలని అనుకోవడం లేదని ఆనంద్ తెలిపాడు.