రెండు రాష్ట్రాల్లో రేపే తొలి విడత ఎన్నికలు
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్ లో 15, జార్ఖండ్ లో 13 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.