వేతన బకాయిలు అడిగేందుకు మేముండగా మీరెవరు?: కార్మికులు, కార్మిక నేతల మధ్య వివాదం
ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ వేతన బకాయిలు అడిగేందుకు కార్మికులు యాజమాన్యం దగ్గరకు వెళ్ళగా, అక్కడే ఉన్న కార్మిక సంఘం నేతలు "మేముండగా మీరు అడగటం ఏమిటి?" అని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. వారి మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కాగజ్ నగర్ డీఎస్పీ సురేష్ బాబు ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు.