జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబర్ 19కి వాయిదా
అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత జగన్ ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. జగన్ తో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆడిటర్ విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు కూడా కోర్టుకు హాజరయ్యారు.