తమిళనాడు జాలర్లను విడుదల చేసిన శ్రీలంక
తమిళనాడుకు చెందిన ఎమర్సన్, ఆగస్టస్, విల్సన్, ప్రశాంత్, లాంగ్లే అనే ఐదుగురు జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 2011లో అరెస్టయిన వారికి కొలంబోలోని స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. దాంతో, జాలర్లను విడుదల చేయాలంటూ తమిళనాడులోని కొన్ని వర్గాలు తీవ్ర నిరసనలు చేశాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లంక అధ్యక్షుడు మహిందా రాజపక్సతో ఫోన్ లో మాట్లాడారు. దాంతో జాలర్లను క్షమాభిక్షతో లంక నుంచి భారతీయ జైలుకు తరలించేందుకు అంగీకరించారు.