రచయిత సుద్దాల అశోక్ తేజకు 'గురజాడ పురస్కారం'
ప్రముఖ సినీ గీత రచయిత, కవి డా.సుద్దాల అశోక్ తేజను 'గురజాడ విశిష్ట పురస్కారం-2014' వరించింది. ఈ మేరకు విజయనగరంలోని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది. విజయనగరంలోని గురజాడ కళాభారతిలో ఈ నెల 30న జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని సుద్దాలకు అందజేస్తామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి తెలిపారు. అదే రోజు గురజాడ రచనలపై సాహితీ సదస్సు నిర్వహించనున్నారు.