ఆంధ్రప్రదేశ్ కు 14 వ జిల్లా... అల్లూరి సీతారామరాజు పేరు మీద కొత్త జిల్లా ఏర్పాటు

31-07-2014 Thu 09:18
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలకు మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి ఏపీలో జిల్లాల సంఖ్యను 14కు పెంచాలని ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఏపీలో కలిసిన ఖమ్మంలోని ఏడు మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాలు, తూర్పు గోదావరిలోని 10 మండలాలు కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 14వ జిల్లా ఏర్పాటు చేయడానికి ఏపీ సర్కార్ రెండు ప్రధాన కారణాలు చెబుతోంది. ఆ రెండు కారణాలు ఏంటంటే.... మొదటికారణం: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో... నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, మూడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని ముందు అనుకున్నారు. అయితే ఇలా కలపడం వల్ల ఆ ఏడు మండలాలు... ఆ జిల్లా కేంద్రాలైన కాకినాడ, ఏలూరులకు చాలా దూరంలో ఉంటాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలు కూడా ఇప్పటికే ఆ జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. జిల్లా ప్రధాన కేంద్రం దూరంగా ఉండడం వల్ల ఈ రెండు జిల్లాల్లోని గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలిపి ఓ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ఏపీ సర్కార్ వచ్చింది. ఈ జిల్లా ఏర్పాటుతో గిరిజన ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. రెండో కారణం: 13 సంఖ్యను ఏపీ ప్రభుత్వం కీడుకు సంకేతంగా భావిస్తోంది. ఈ సంఖ్య రాష్ట్రానికి ఏమాత్రం అచ్చిరాదని ఏపీ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పశ్చిమదేశాల్లో కూడా వారి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా 13 వ సంఖ్యను వాడరు. 13 సంఖ్యను వారు అశుభంగా భావిస్తారు. ఈ కారణంగా కూడా ఏపీలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more