సచిన్ కోసం ధ్యాన్ చంద్ కు యూపీఏ ద్రోహం!

30-07-2014 Wed 10:13
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం యూపీఏ సర్కారు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ద్రోహం చేసిందనే వార్తలు వెల్లువెత్తాయి. భారతరత్న అవార్డుకు అర్హుల ఎంపికలో మన్మోహన్ సింగ్ సర్కారు తన విశ్వసనీయతకు తీవ్ర విఘాతం కలిగించుకునేలా వ్యవహరించిందని 'హెడ్ లైన్స్ టుడే' ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించడంతో యావత్ భారతావని నివ్వెరపోయింది. అప్పటిదాకా క్రీడాకారులకు భారతరత్న పురస్కారం ఇచ్చే సంప్రదాయం లేదు. హాకీలో మూడుసార్లు భారత్ కు ఒలింపిక్స్ బంగారు పతకాలను సాధించిపెట్టిన ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాలని చాలాకాలం నుంచి పలు క్రీడా సంఘాలతో పాటు ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో... యూపీఏ ప్రభుత్వం భారతరత్న గ్రహీతల జాబితాలో క్రీడాకారులను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నపళంగా ధ్యాన్ చంద్ స్థానంలో సచిన్ పేరు చేర్చి గతేడాది పెద్ద చర్చకే తెరలేపింది. సచిన్ కూడా క్రికెట్ లో భారత్ ను సమున్నత స్థానంలో నిలిపిన నేపథ్యంలో నాడు దీనిపై అంతగా వివాదం చెలరేగలేదు. తాజాగా హెడ్ లైన్స్ టుడే వెల్లడించిన కథనం ప్రకారం, భారతరత్న అవార్డుల ప్రకటన వెలువడటానికి రెండు రోజుల ముందు వరకు కూడా క్రీడాశాఖ మంత్రి జితేంద్రసింగ్ పంపిన సిఫారసుల మేరకు సీఎన్ఆర్ రావుతో పాటు ధ్యాన్ చంద్ పేరే ఉంది. అయితే సరిగ్గా రెండు రోజుల ముందు సచిన్ పూర్తి వివరాలను సాయంత్రంలోగా పంపాలని కేంద్ర క్రీడాశాఖను ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించింది. సదరు శాఖ నుంచి వివరాలను అందుకున్న మరుక్షణమే ద్యాన్ చంద్ పేరు స్థానంలో సచిన్ పేరు చేరిపోయింది. అసలు భారతరత్న పురస్కార గ్రహీతల విభాగంలో క్రీడాకారులకు కూడా చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నదే ధ్యాన్ చంద్ కోసమైతే, చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించడం ఆ హాకీ మాంత్రికుడికి ద్రోహం చేసినట్లు కాకపోతే మరేంటనేది సగటు భారతీయుడి ప్రశ్న. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుగు చూసిన ఈ కథనంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more