మోడీ ఎర్రకోట ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి!

29-07-2014 Tue 08:53
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తిరుగులేని వాగ్ధాటితో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన మోడీ, ఎర్రకోట నుంచి చేసే ప్రసంగం, జాతికి కొత్త జవసత్వాలను నింపేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పొచ్చు. ఎర్రకోట నుంచి మోడీ చేసే ప్రసంగంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, గతేడాది ఎర్రకోట నుంచి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగంపై గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోడీ విమర్శలు గుప్పించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ చేసిన తొలి ప్రసంగ పాఠాన్నే తాజాగా మన్మోహన్ సింగ్ మళ్లీ చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. "నెహ్రూ, తన తొలి ప్రసంగంలో ప్రస్తావించిన సమస్యలు, వెలిబుచ్చిన ఆందోళనలనే మీరూ వెలిబుచ్చారు. అంటే 60 ఏళ్లలో మనమంతా ఏం చేయలేదా?" అంటూ మోడీ నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో మోడీ ఎర్రకోట ప్రసంగంపై తాజాగా ఆసక్తి నెలకొంది. ప్రధాని ప్రసంగానికి సంబంధించి ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ఈ నెలాఖరులోగా కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథీ కార్యాలయానికి చేరవేయాలని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్రంలోని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రసంగంలో ఏఏ అంశాలను పొందుపరచాలనే విషయంపై కెబినెట్ సెక్రటేరియట్ ఆగస్టు 10లోగా నిర్ణయం తీసుకుంటుంది. ఎర్రకోట ప్రసంగం ద్వారా బ్రాండ్ ఇండియా నినాదాన్ని మోడీ వినిపించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంగ్ల అక్షరం ’టీ’ తో ప్రారంభమయ్యే ఐదు అంశాలు... సంస్కృతి(ట్రెడిషన్), మేధస్సు(టాలెంట్), పర్యాటకం(టూరిజం), వాణిజ్యం(ట్రేడ్), సాంకేతికం (టెక్నాలజీ) ల సమాహారమే బ్రాండ్ ఇండియా నినాద లక్ష్యంగా బీజేపీ వర్గాలు ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more