వరదల్లో చిక్కుకున్న బాబా రాందేవ్
హిమాలయాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. దీంతో పవిత్ర స్థలాలకు వెళ్లిన పలువురు యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో యాత్రికులకు సహాయకచర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ గోముఖ్ వద్ద వరదల్లో చిక్కుకున్నారు. ఆయనతో పాటు 450 మంది శిష్యులు కూడా ఉన్నారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయకచర్యలు ముందుకు సాగడం లేదని సమాచారం.